ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ మండలంలో 45% సర్ ప్రక్రియ పూర్తి తాసిల్దార్ జ్యోతి రత్నకుమారి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలో 45 శాతం సర్ ప్రక్రియ పూర్తయిందని తాసిల్దార్ జ్యోతి రత్నకుమారి పేర్కొన్నారు, పట్టణంలోని కుదాబవీధి సచివాలయం అహోబిలం రోడ్ సచివాలయంలో సర్ ప్రక్రియను ఆళ్లగడ్డ ఎంపీడీవో నూర్జహాన్ మున్సిపల్ కమిషనర్ కిషోర్ తో కలిసి ఆమె పరిశీలించారు, సర్ ఫారాల పంపిణీ డిజిటలైజేషన్ వివరాలు సంబంధిత బిఎల్ఓ ల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు, గడువు నాటికి డిజిటల్లైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని తాసిల్దార్ జ్యోతి రత్నకుమారి రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు