యాగంటి ఉమామహేశ్వరుని సన్నిధిలో పూజలు చేసిన సంజామల ఎస్సై రమణయ్య
సంజామల: కార్తీకమాసం మూడో సోమవారం పురస్కరించుకొని సంజామల ఎస్.ఐ. రమణయ్య ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ అధికారులు, అర్చకులు ఎస్.ఐ. రమణయ్య కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం పలికారు. యాగంటి పల్లె ఉపసర్పంచ్ మౌలీశ్వర్ రెడ్డి, అర్చకులు మహేశ్ శర్మ, చిన్న దేవుడు, రమేశ్ పాల్గొన్నారు.