ఖైరతాబాద్: ఈనెల 11న జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి : నగరంలో ఎన్నికల అధికారి కర్ణన్
11న జరిగే జూబ్లీహిల్స్ బైపోల్‌కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు. ఉ. 7 గం. నుంచి సా.6 గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు. ‘10న సా. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం నుంచి EVM డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. 4 EVM మెషీన్లకు 3 అంచెల భద్రత ఉంటుంది. ఫ్లయింగ్ స్క్వాడ్స్ 45, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ 45, వీడియో టీమ్స్ 8, అకౌంటింగ్ టీమ్‌లు 2 ఉంటాయి' అని ఆయన వెల్లడించారు.