కనిగిరి: పట్టణంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో కలిసి పోలీసుల భారీ ర్యాలీ
కనిగిరి పట్టణంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కనిగిరి సీఐ ఖాజావలి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు భారీ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం చర్చి సెంటర్లో జరిగిన కార్యక్రమంలో సిఐ ఖాజావలి మాట్లాడుతూ... పోలీస్ అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. రేయనక, పగలనక, ఎండనక, వాననక పోలీసులు ప్రజల రక్షణ కోసం నిరంతరం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తారన్నారు. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగస్పూర్తిని ప్రతి ఒక్కరూ మరణం చేసుకోవాలన్నారు. కనిగిరి ఎస్సై శ్రీరామ్ పాల్గొన్నారు.