బనగానపల్లె: కోవెలకుంట్ల లో సొంత నిధులతో వృద్ధులు,వికలాంగులు,అనాధలకు పెన్షన్ల పంపిణీ
నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో ప్రకృతి పీఠం వ్యవస్థాపకుడు పల్లె నరసింహారెడ్డి తన సొంత నిధులతో ఆదివారం పింఛన్ల పంపిణీ చేశారు. ప్రతినెలా వృద్ధులు, వికలాంగులు, అనాథలకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. తల్లిదండ్రుల ఆశీస్సులతో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పుల్లారెడ్డి ఈ కార్యక్రమంలో భాగస్వామి కావడం సంతోషమన్నారు. నారాయణ స్వామి, పుల్లారెడ్డి పాల్గొన్నారు.