ఖైరతాబాద్: యూసఫ్ గూడా లో రేవంత్ రెడ్డి సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన
యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్ వద్ద మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశంలో ఓ వైపు ఉద్రిక్తత నెలకొంది. చిత్రపురి కాలనీకి చెందిన వల్లభనేని అనిల్పై చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. CM రేవంత్ డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు