బెల్లంపల్లి: తాళ్ళగురిజాల రైతు వేదిక లో దొంగతనం చేసిన దొంగలను అరెస్ట్ చేసినట్లు తెలిపిన రూరల్ సిఐ హనోక్
బెల్లంపల్లి మండలం గురజాల రైతు వేదికలో దొంగతనానికి పాల్పడిన ఎల్ఈడి టీవీని స్వాధీనం చేసుకొని నిందితులను తరలించిన పోలీసులు ఈ సందర్భంగా రూరల్ సిఐ హనోక్ మాట్లాడుతూ జులై మూడవ తేదీన రాత్రి సమయంలో రైతు వేదిక యొక్క తాళం పగులగొట్టి అందులో ఉన్న వీడియో కాన్ఫరెన్స్ కి ఉపయోగపడే గవర్నమెంట్ కి సంబoదించిన 1,90,000 రూపాయల విలువ కల ఎల్ఈడి టీవీ సౌండ్ బాక్సులు గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారని AEO ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు ఈరోజు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి ఎల్ఈడి టీవీ స్వాధీనం చేసుకొని రిమాండ్ తరలించినట్లు పేర్కొన్నారు