మీర్జాగూడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. స్పాట్లోనే మృతి చెందిన యువకుల మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడే నలుగురు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యు లకు మృతదేహాలను అప్పగించనున్నారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగారు.