అమరావతి: నదీ ప్రవాహాన్ని తలపిస్తున్న అమరావతి గ్రామంలోని రోడ్లు.
పల్నాడు జిల్లా, పెడకూరపాడు నియోజకవర్గం, అమరావతి మండలం, అమరావతి గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక వాడుక నీరు రోడ్ల పైకి ప్రవహిస్తోంది. మంగళవారం నీరు ఎక్కువగా వచ్చి రోడ్లపైకి చేరింది. దీంతో ప్రయాణికులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురకొంటున్నామని తెలిపారు. నీరు రోడ్లపైకి వచ్చి ఉండటంతో R$B రోడ్డు పూర్తిగా ధ్వంసమైందని ప్రజలు ఆరోపిస్తున్నారు.