ఇటీవల జరిగిన చేవెళ్ల ఘోర బస్సు ప్రమాదంలో 19 మంది మరణించిన విషయం తెలిసిందే. గాయపడి చేవెళ్లలోని పీఎంఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం, ఘటన జరిగిన స్థలాన్ని కూడా పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.