లింగంగుంట్ల గ్రామంలో ఉపాధి కూలీ మృతి.
పల్నాడు జిల్లా, పెడకూరపాడు నియోజకవర్గం, లింగుంగుంట్ల ఎస్సీ కాలనీకి చెందిన ఎనుబర్ల బాబు(50) లింగంగుంట-పెదకూరపాడు మార్గంలో కందకం తవ్వకం పనులకు శనివారం తోటీ కూలీలతో వచ్చాడు. రెండు గజాలు మట్టి తవ్వి ఎండవేడికి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి కూలీలు సపర్యలు చేసి ఆటోలో పెదకూరపాడు సీహెచ్సీకి తరలించారు. అప్పటికే బాబు మృతి చెందడం జరిగిందని వైద్యులు తెలిపారు.