నియోజకవర్గంలోని వినియోగదారులంతా ఫైవ్ స్టార్ రేటింగ్ కలిగిన గృహోపకరణాలు వాడాలని ఉండ్రాజవరం విద్యుత్ శాఖ AEE దొరబాబు సూచన
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు ఉండరాజవరం మండలం మోర్త సెక్షన్ విద్యుత్ శాఖ ఏఈఈ దొరబాబు పలు సూచనలు చేశారు. వేసవిలో విద్యుత్ సరఫరా సమస్యను అధిగమించేందుకు ప్రధానమంత్రి సూర్య ఘర్ బిజిలి యోజన పథకంలో భాగంగా ప్రతీ వినియోగదారుడు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న సోలార్ సిస్టమ్ అమర్చుకోవాల్నారు. గృహ అవసరాల నిమిత్తం ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న ఉపకరణాలు వాడాలని సూచించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ముఖ్యంగా రైతులకు మెరుగైన సరఫరా ఇవ్వగలుగుతున్నామని పేర్కొన్నారు.