మదనపల్లి బ్యూటీ కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు
మదనపల్లి పట్టణంలోని బిటి కళాశాల నందు ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా భరతనాట్యం కూచిపూడి భక్తి పాటలు దేశభక్తి గీతాలు చిన్నారులు ముత్యాలు ప్రదర్శించారు. అలాగే తెలుగు పద్యాలు గేయాలతో మాతృభాషపై మమకారం చాటారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సెల్ ఫోన్లకే పరిమితం అవుతున్న చిన్నారుల ఆలోచన మార్చేందుకే ఈ కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు