ఒంగోలు అర్బన్: ఉమ్మడి జిల్లాలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్లో ప్రాంగణాలను పరిశుభ్రం పోలీసు సిబ్బంది
Ongole Urban, Prakasam | Jun 20, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పోలీసులు పోలీస్ స్టేషన్ ప్రాంగణాలను పరిశుభ్రం చేశారు. ఎస్ఐలు సీఐలు కలిసి పోలీసు సిబ్బందితో పోలీస్ స్టేషన్ ఆవరణలలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల కలుగు ప్రయోజనాలను పోలీసు సిబ్బందికి ఎస్సైలు సీఐలు సూచించారు. తర్వాత పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటామని సిబ్బంది చేత అధికారులు ప్రతిజ్ఞ చేయించారు.