డోన్: బేతంచర్ల లోని ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్ జయంతికి ఏర్పాట్లు
Dhone, Nandyal | May 11, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల లోని కళాచట్ల ఆంజనేయస్వామి దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం ఆంజనేయ స్వామికి ప్రత్యేక అభిషేకాలు ఆకు పూజ సహస్రనామ అర్చన విశేష ఫలాలంకరణ నిర్వహించనున్నారు అనంతరం స్వామివారికి మధ్యాహ్నం మహా మంగళహారతి ఇచ్చిన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక బృందాలచే భజన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు