బైక్ స్టాండ్‌గా మారిన నాగలాపురంలోని బస్సు షెల్టర్
నాగలాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎదురుగా ద్వారకా నగర్ రోడ్డుకు ఆనుకుని ఎంపీ నిధులతో బస్ షెల్టర్ నిర్మించారు. రెండు లక్షలు అంచనా వ్యయంతో నిర్మించిన ఈ బస్టాండు ప్రస్తుతం బైక్ స్టాండ్గా దర్శనమిస్తోంది. రోగులు, గర్భవతులు, బాలింతలు వచ్చినా నిలవడానికి నీడ లేక అల్లాడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకొని ఉపయోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.