నందికోట్కూరు: మంచికి మారుపేరు చౌటుకూరు సర్పంచ్
వరుసగా రెండుసార్లు గ్రామానికి సేవలు, మదర్ సాహెబ్ కు ఘన వీడ్కోలు
ఒకసారి కాదు రెండుసార్లు వరుసగా గ్రామ సర్పంచ్ గా ఎన్నికైగ్రామానికి సేవలందించారు అంతేకాదు ఆయనంటే మంచికి మారుపేరు ఎవరు పిలిచినా పలికే వ్యక్తి గ్రామ అభివృద్దే ధ్యేయంగా గ్రామ ప్రజలకు ఎలాంటి చిన్న సమస్య తలెత్తకుండా గ్రామాన్ని అభివృద్ధి బాటలో పట్టించిన వ్యక్తి చౌటుకూరు సర్పంచ్ డి మదర్ సాహెబ్ అని చెప్పవచ్చు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని చౌటుకూరు గ్రామంలో గత ఐదేళ్లుగా సర్పంచ్ గా పనిచేశారు. గ్రామంలో ఆరు త్రాగునీటి బోర్లు ఉండగా ఎలాంటి చిన్న నీటి సమస్య కూడా రాకుండా ప్రజలకు త్రాగునీటిని సరఫరా చేసేవారు.బోర్లు మరమ్మతులు అయిన వెంటనే రిపేర్లు చేయించే వారు.సర్పంచ్ పదవీకాలం ఈనెల 2వ త