బనగానపల్లె: తప్పుడు హామీలతోనే కూటమికి అధికారం : బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
కూటమి నాయకులు తప్పుడు హామీలతో అధికారం చేపట్టారని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విమర్శించారు. రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు పట్టణంలో పెంచిన ఇంధన ధరలకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. పార్టీ కార్యాలయ ప్రాంగణం క్షేత్రంగా తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి వినతిపత్రం ఇచ్చారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని కాటసాని డిమాండ్ చేశారు