మార్కాపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అందజేశారు. ఎక్కువ శాతం రెవెన్యూ కు సంబంధించిన సమస్యలపైనే ప్రజలు అర్జీలు సమర్పించారు. వాటిని సంబంధిత అధికారులు పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని జెసి ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు