పొన్నూరు: కొత్తరెడ్డిపాలెంలో స్వరాలు ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించిన మంత్రి సత్యకుమార్ యాదవ్
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో మెలియాయిడోసిస్ లక్షణాలు ఒకరిలో బయటపడటంతో వైద్య ఆరోగ్య శాఖ ఫోకస్ పెట్టింది. తురకపాలెం తరహాలోనే కొత్తరెడ్డిపాలెంలో జ్వరంతో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందడంతో మంత్రి సత్య కుమార్ యాదవ్ అక్కడ పరిస్థితి అధ్యయనం చేయాలని అధికారులకు ఆదివారం ఆదేశించారు. కాగా చేబ్రోలు సమీపంలో కూడా క్వారీలు ఉన్న కారణంగానే ఈ లక్షణాలు బయట పడ్డాయా అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో మంత్రి స్పందించారు.