జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. శుక్రవారం షేక్పేట్ తహశీల్దార్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ర్యాలీగా వెళ్లిన నవీన్ యాదవ్ మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఆయన వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, మేయర్ గద్వాల విజయలక్ష్మి ఉన్నారు.