నంద్యాల అర్బన్: మంత్రి నారా లోకేష్ పై నంద్యాలలో PDSU నాయకులు ద్వజం
Nandyal Urban, Nandyal | Jun 25, 2026
రాష్ట్రంలో విద్యా రంగ సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి లోకేశ్ పూర్తిగా విఫలమయ్యా రని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ఎండి రఫీ, సింహాద్రి కిరణ్ మండిపడ్డారు. నంద్యాలలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. జీవో - 75 రద్దు, బకాయిల విడుదల, హాస్టల్ మెస్ ఛార్జీల పెంపు, పాఠ్యపుస్తకాల పంపిణీ, కార్పొరేట్ ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు.