జహీరాబాద్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్స్ వ్యతిరేకిస్తూ నిరసన
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్మిక, రైతు వ్యతిరేక లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రామచందర్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో బుధవారం మధ్యాహ్నం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు, రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీలకు కేంద్ర బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ అన్యాయానికి గురిచేస్తుందన్నారు. కేంద్రం నల్ల చట్టాలను రద్దు చేసే వరకు ఆందోళన చేపడతామని హెచ్చరించారు.