ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణంలో వైసిపి నాయకులు నిరసన, ధరల పెరుగుదలపై కూటమి ప్రభుత్వంని ఎండగట్టిన వైసీపీ నేతలు
Ongole Urban, Prakasam | Jun 9, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని వైసీపీ కార్యాలయం వద్ద మంగళవారం వైసీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కూటమిపాలనపై తీవ్ర విమర్శలకు పెంచారు. పేదలు ఎవరు ఆనందంగా లేరని దేశంలో ఎక్కడలేని విధంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు అత్యధికంగా మన రాష్ట్రంలోనే ఉన్నాయని వారు ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. మళ్లీ 2029 ఎన్నికలలో సీఎం గా జగనన్నను చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.