ఉరవకొండ: రబీ సీజన్ దాటిపోతున్న రాయితీ విత్తన పప్పుశనగ పంపిణీ చేయకపోవడంపై వ్యవసాయ శాఖ ADA కార్యాలయం ఎదుట ఆందోళన
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ కేంద్రంలోని ఏడిఏ కార్యాలయం వద్ద ప్రస్తుత రబీ సీజన్ దాటి పోతున్న కూడా రాయితీ విత్తనపప్పు సెనగ పంపిణీ చేయకపోవడం ఏమిటని వైయస్సార్సీపి నాయకులు మంగళవారం ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. నల్లరేగడి భూముల్లో ప్రధాన పంటగా పప్పు సెనగను సాగు చేయడం జరుగుతుందని అయితే ప్రభుత్వం రాయితీ పప్పుశనగను పట్టించుకోకపోవడం ఏమిటని వారు నిలదీసి ఏ డి ఏ సత్యనారాయణ కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు ఎం అశోక్ కుమార్, రాజేష్, బసవరాజు, గోవిందు తదితరులు పాల్గొన్నారు.