నంద్యాల అర్బన్: నంద్యాలలో అద్దెకు ఇల్లు కావాలని వచ్చి మహిళ మెడలో గొలుసు ఎత్తుకెళ్లిన దొంగ
Nandyal Urban, Nandyal | Jun 21, 2026
నంద్యాల పట్టణంలోని అద్దెకు ఇళ్లు కావాలని వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి మహిళపై దాడి చేసి మెడలోని బంగారు గొలుసును 1 లాక్కెళ్లాడు. నంద్యాల పట్టణం ఉప్పరపేటలోని బ్రహ్మణ వీధిలో చరిత అనే మహిళ.. ఇళ్లు అద్దెకు ఇస్తామని బోర్డులో ఫోన్ నంబర్లు పెట్టారు. నిందితుడు ఇళ్లు చూసి మరుసటి రోజు వస్తానని చెప్పాడు. మరుసటి రోజు వచ్చి తాగడానికి నీళ్లు ఇవ్వాలని కోరాడు. ఇంట్లోకి వెళ్లిన మహిళ వెంట వెళ్లి ఆమెపై దాడి చేసి మెడలోని 25 గ్రాముల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.