అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోనే పాపంపేట వద్ద శుక్రవారం నాలుగున్నర గంటల సమయంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పాపంపేట భూ సమస్యలపై బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్ మాట్లాడుతూ పాపంపేటలో 932 ఎకరాల సోత్రీయ భూములు ఆక్రమించుకునేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని వారి వెనకాల ఎవరు ఉన్న వారితో కూడా పోరాటం చేసేందుకు సిపిఐ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్ భూ కబ్జాదారులకు హెచ్చరించారు.