ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ లో చలవ పందిళ్లు కుర్చీలు ఏర్పాటు సీఐ నాగరాజారావు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల సౌకర్యార్థం ఆళ్లగడ్డ టౌన్ స్టేషన్ ఆవరణలో సిఐ నాగరాజారావు ఆధ్వర్యంలో చలవ పందిర్లు, కుర్చీలు ఏర్పాటు చేశారు, స్టేషన్కు వచ్చే ప్రజలు ఎండ వేడిమితో ఇబ్బంది పడకుండా సిఐ నాగరాజారావు చలవ పందిర్లు వేయించారు, ఈ సందర్భంగా సిఐ నాగరాజు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉండడంతో పోలీస్ స్టేషన్ కి వచ్చే ఫిర్యాదారులు ఇబ్బందులు పడకుండా కుర్చీలు కూడా ఏర్పాటు చేసిన వారు తెలిపారు