బేతంచెర్ల మండలంలో పశువులకు తప్పిన ప్రమాదం
Dhone, Nandyal | Apr 27, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని గోరుమానుకొండలో జొన్న నాము తిని 40 పశువులు అస్వస్థతకు గురయ్యాయి. సమాచారం అందుకున్న పశువైద్య బృందం సకాలంలో స్పందించి చికిత్స అందించడంతో భారీ ప్రాణాపాయం తప్పింది. దురదృష్టవశాత్తు ఒక పశువు మృతి చెందింది. జొన్న కోసిన తర్వాత పొలంలో మిగిలే చిన్న కర్రలను పశువులు తినకుండా జాగ్రత్త వహించాలని వెటర్నరీ ఏడీ రామసుబ్బారెడ్డి రైతులకు సూచించారు.