ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఫేస్ వాష్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పోలీసులు
Ongole Urban, Prakasam | Apr 15, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు నేషనల్ హైవేలలో ఫేస్ వాష్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు బుధవారం స్థానిక పోలీసులు వెల్లడించారు. దూరప్రాంతాలకు వెళ్లి వాహన డ్రైవర్లకు ఫేస్ వాష్ చేయించి రెండు ప్రమాదల నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాహన డ్రైవర్లు కూడా దూర ప్రాంతాలు వెళ్లే సమయంలో నిద్ర వచ్చినట్లయితే సురక్షితమైన ప్రాంతాలలో వాహనాన్ని నిలుపుకొని తమ గమ్యస్థానానికి సురక్షితంగా చేరాలన్నారు. గంజాయి తరలింపు అధికంగా మారిన నేపథ్యంలో అనుమానిత వాహనాలను క్షుణ్ణంగా తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.