కామారెడ్డి: పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలి : రాష్ట్ర కార్యదర్శి జీవిఎం విఠల్
కామారెడ్డి : రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ 8 వేల కోట్ల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని భారతీయ విద్యార్థి మోర్చ డిమాండ్ చేస్తుంది అని రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విటల్ అన్నారు. గత నాలుగు సంవత్సరాలు నుండి ప్రభుత్వం విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. ఉన్నత చదువులు చదవడానికి ప్రభుత్వ , ప్రవేట్ కళాశాలలో రియంబర్స్మెంట్ రాకపోవడంతో డబ్బులు కడితేనే సర్టిఫికెట్స్ ఇస్తామని కళాశాల అధికారులు, యజమాన్యాలు అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని అన్నారు.