కర్నూలు: జిల్లాలో మిశ్రమ పంటలు ప్రోత్సహించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి
జిల్లాలో మిశ్రమ పంటలను ప్రోత్సహించాలని , పంట నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని , వలసలు నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అనుబంధ శాఖల సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంకాలం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో వ్యవసాయ అనుబంధ శాఖల సమావేశాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి నిర్వహించి సమీక్షించి తగు సూచనలు జారీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ...జిల్లాలో ఉల్లి ,టమోటా ,పత్తి ,మిరప ,శనగ మొదలగు పంటలను ఈ సంవత్సరం ఖరీఫ్ మరియు రబీలో ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు , ఒక ఎకరా కు ఎంత దిగుబడి వస్తుంది , రైతుకు