పలమనేరు: స్థల వివాద వాదనల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ్ తో సహా మరో 10మందిపై పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు.
పలమనేరు: మండల పోలీసు వర్గాలు తెలిపిన సమాచారం మేరకు. ఓ స్థల వివాదంలో నిర్మాణాన్ని కూల్చడానికి జెసిబితో వెళ్లిన మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ్, ఎస్ఐ లోకేష్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన సంగతి విధితమే. ఎస్ఐ లోకేష్ రెడ్డి ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ్ తో సహా సుమారు మరో 10 మందిపై కేసులు నమోదు చేస్తున్నట్లు సమాచారం. స్థల యజమాని ఫిర్యాదు మేరకు మరో రెండు కేసులు కూడా నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ప్రస్తుతం పలమనేరులో చర్చనీయాంశంగా మారింది, పోలీస్ అధికారులు మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు.