నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Apr 23, 2026
నంద్యాల జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు.ప్రజలు ఇంధనం కోసం క్యూలు కట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాకినాడ, కడప, అనంతపూర్ జిల్లాల నుంచి నిల్వలు వచ్చి రీఫిల్లింగ్ నిరంతరం కొనసాగుతోందని వివరించారు. ప్రజలు కేవలం తమ అవసరమైన మేరకే ఇంధనాన్ని తీసుకోవాలని, అనవసరంగా నిల్వ చేయవద్దని ఆమె కోరారు.