పుంగనూరు: స్కూటర్ పై ప్రమాదకర విన్యాసాలు చేస్తూ బోల్తాపడ్డ యువకుడు పరిస్థితి విషమం.
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సమీపంలో ద్విచక్ర వాహనంలో ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో. పట్టణానికి చెందిన ఇద్రిస్ 20 సంవత్సరాల త్రీవంగా గాయపడ్డాడు. వెంటనే గమనించిన స్థానికులు ఇద్రీస్ ను పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇద్రిస్ పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం మదనపల్లెలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ఘటనపై పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.