మండలంలోని అధికారులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని అనంతపురం జిల్లా బెళుగుప్ప మండల పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశంలో సభ్యులు అధికారులకు సూచించారు. ఎంపీపీ పెద్దన్న అధ్యక్షతన తాసిల్దార్ అనిల్ కుమార్ ఎంపీడీవో లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సభను నిర్వహించారు. గ్రామాల్లో అధికారులు సమస్యలను గుర్తించి పరిష్కరించే విధంగా కృషి చేయాలని సభ్యులు సూచించారు.