ఆళ్లగడ్డ: వెంకటాపురం గ్రామం వద్ద కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం
నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం వెంకటాపురం గ్రామం వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది, జాతీయ రహదారి దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొని ఇసుకపల్లి కి చెందిన పుష్పం గురుమూర్తి అక్కడికక్కడే మృతి చెందారు, తీవ్రంగా గాయపడిన మరొక వ్యక్తిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు, ఈ ఘటనపై సిరివెళ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు