కరీంనగర్: ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఆటోమెటిక్ జరిమానా విధిస్తున్నాం: ట్రాఫిక్ సీఐ రమేష్
వితౌట్ హెల్మెట్, వితౌట్ నెంబర్ ప్లేట్ తో వాహనాలను నడప కూడదని కరీంనగర్ ట్రాఫిక్ సిఐ రమేష్ తెలిపారు. నగరంలో సుమారు 769 కి పైగా ఆటోమెటిక్ కెమెరాలు ఉన్నాయని, ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఆటోమెటిగ్గా జరిమాన పడుతుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను వాహనాలతో బయటికి పంపించేటప్పుడు గమనించాలని తెలిపారు. వాహనాల ను తనిఖీ చేయాలని తెలిపారు. సౌండ్ పొల్యూషన్ పాల్పడితే వాహనాలను సీజ్ చేసే అవకాశం ఉందన్నారు. ప్రతిరోజు కరీంనగర్ లో వివిధ ప్రాంతాలలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని,నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్, వితౌట్ హెల్మెట్ పాల్పడుతున్న చాలామంది పట్టుబడుతున్నారని తెలిపారు.