లింగంపేట్: జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి స్వచ్ఛత పై ప్రతిజ్ఞ, సరేనా పోషకాహారం అందించాలి : కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
సరైన పోషకాహారం తీసుకోవడం వలన శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా తయారవుతారని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం నాలుగు గంటలకు జిల్లా కలెక్టర్ లింగంపేట మండలం పోతాయిపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ లో నిర్వహించిన స్వచ్ఛతా హే సేవా-2025, పోషక్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛత పై విద్యార్థులచే ఏర్పాటుచేసిన మానవహారం కార్యక్రమం ద్వారా విద్యార్థులతో కలిసి స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోషక్ అభియాన్ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా అన్ని అంగన్వాడి కేంద్రాలలో పోషక మాసం కార్యక్రమాన్ని నిర్వహించి పౌష్టికాహారం విలువను తెలియజేయడం జరిగింది.