ఒంగోలు అర్బన్: ఒంగోలు మినీ స్టేడియంలో ప్రారంభమైన జూనియర్ యోగాసన పోటీలు
Ongole Urban, Prakasam | Jun 14, 2026
యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఒంగోలు మినీ స్టేడియంలో జూనియర్స్ విభాగం ( 8 - 18 ఏళ్లు ) లో యోగాసన పోటీలు జరిగాయి. జిల్లాస్థాయి పోటీలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయని ఈ పోటీల నోడల్ ఆఫీసర్ అయిన ఎస్సీ పర్యవేక్షణ చేస్తారని కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్ నాయక్ తెలిపారు. సోమవారం సీనియర్స్ విభాగంలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. ఆయుష్ విభాగ సీనియర్ వైద్యులు డాక్టర్ భీమ్ నాథ్, డాక్టర్ భ్రమరాంబ, ఇతర అధికారులు కూడా ఈ పోటీలను పర్యవేక్షించారు అని తెలియజేశారు