అనంతపురం అర్బన్: అనంతపురం నగర శివారులోని చిన్మయ నగర్ లో విద్యుత్ షాక్ తగిలి యువకుడు మృతి
Anantapur Urban, Anantapur | May 5, 2026
అనంతపురం నగర శివారులోని చిన్మయ నగర్ లో విద్యుత్ షాక్ తగిలి కదిరికి చెందిన ఆజం ఖాన్ అనే యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించామని పోలీసులు తెలిపారు.