అదిలాబాద్ అర్బన్: పత్తి కొనుగోళ్లపై రైతు సంఘాల డిమాండ్: కలెక్టర్‌కు వినతిపత్రం
ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే పత్తి కొనుగోళ్లలో రైతులకు సరైన ధర కల్పించాలని, దళారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు జరపాలని రైతు సంఘాలు ఆదిలాబాద్ కలెక్టర్‌ను కోరాయి. అన్-లోడింగ్ ఛార్జీలు వసూలు చేయవద్దని, నగదును త్వరగా జమ చేయాలని డిమాండ్ చేశాయి.