నంద్యాల జిల్లాలోని నల్లమల అడవుల్లో పెరిగిన పులుల సంతతి.
నంద్యాల జిల్లాలోని నల్లమల అడవుల్లో పులుల సంతతి పెరిగినట్లు అటవీశాఖ అధికారులు ఆదివారం తెలిపారు. పదేళ్ల క్రితం 34 పెద్ద పులులు ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 87 చేరినట్లు వెల్లడించారు. పులుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అడవుల్లోకి ఎవరినీ రానివ్వకుండా చేయడంతో పాటు పలు నిబంధనలు పెట్టి, చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.