జహీరాబాద్: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా విద్యార్థుల ఐక్యత మార్చ్ భారీ ర్యాలీ
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో యూనిటీ మార్చ్ కార్యక్రమంలో విద్యార్థులు, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పట్టణంలోని మెథడిస్ట్ రూరల్ హై స్కూల్ నుంచి బాగారెడ్డి స్టేడియం వరకు ఐక్యత మార్చ్ ర్యాలీ చేపట్టారు. యూనిటీ మార్చ్ లో విద్యార్థులు జాతీయ జెండాలు ప్రదర్శిస్తూ ఉక్కుమనిషి ఐక్యత స్ఫూర్తిని చాటి చెప్పారు. ర్యాలీ అనంతరం స్టేడియం మైదానంలో జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్, జిల్లా యువజన అధికారి రంజిత్ రెడ్డి నేతృత్వంలో విద్యార్థులు ఉపాధ్యాయులతో ఐక్యత ప్రతిజ్ఞ చేయించారు.