ధన్వాడ: భూ నిర్వాసితుల చేపట్టిన రిలే నిరాహార దీక్ష విరమణ మంత్రి వాకిటి నిమ్మరసం
కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులు నారాయణపేట మున్సిపల్ పార్కులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలను మంత్రి వాకిటి శ్రీహరి ఆదివారం నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. భూ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎకరాకు రూ.20 లక్షల పరిహారం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించారని మంత్రి తెలిపారు. దీక్ష విరమించిన రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.