30న జరిగే పాలీసెట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి : బేతంచర్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శైలేంద్ర కుమార్
Dhone, Nandyal | Apr 28, 2025 బేతంచెర్ల పట్టణంలో ఈ నెల 30 న జరగనున్న పాలిసెట్-2025 ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ శైలేంద్ర కుమార్ తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాల, సుమేధ హైస్కూల్, రీడ్ జూనియర్ కళాశాల, సెంట్ ఆన్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లతో పరీక్ష నిర్వహణ గురించి సోమవారం చర్చించారు.