ఉరవకొండ: ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో జ్వరంతో బాలుడు మృతి అయితే సరైన సమయంలో వైద్యం అందించకపోవడంతోనే మృతి చెందాడని బంధువుల ఆందోళన
అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో జ్వరంతో చేరిన వజ్రకరూరు మండలం చాబాల గ్రామానికి చెందిన నాలుగు సంవత్సరాల ఆహరోన్ గురువారం రాత్రి మృతి చెందాడు. వైద్యులు సరైన సమయానికి వైద్యం అందించకపోవడంతోనే తమ కుమారుడు మృతి చెందాడని చిన్నారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు బంధువులు శుక్రవారం ఉదయం ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. వైద్య సిబ్బంది డాక్టర్ నిర్లక్ష్యంతోనే తమ చిన్నారి మృతి చెందాలని బంధువులు ఆరోపించారు. ఆసుపత్రి వద్ద పోలీసులు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.