గుడిహత్నూరు: ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించేలా శిక్షణలు అందించడం అభినందనీయమం:ఆదిలాబాద్ కలెక్టర్
ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించేలా శిక్షణలు అందించడం అభినందనీయమని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో 8 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఉచిత నైపుణ్య శిక్షణ తరగతులను ఆదిలాబాద్ రణదీవేనగర్ ప్రభుత్వ పాఠశాలలో కలెక్టర్ ముఖ్య అథితిగా హాజరై ప్రారంభించారు. అనంతరం పోటీ పరీక్షలకు సంబంధించిన బుక్ లెట్ను ఆవిష్కరించారు.