చీమకుర్తి పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం విద్యాసంస్థల బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలలకు వెళ్లిన ఎస్ఎఫ్ఐ నాయకులు పాఠశాలలను మూయించి, విద్యార్థులను క్లాసు రూముల నుండి బయటకు పంపారు. బంద్ కార్యక్రమం విజయవంతం అయినట్లు ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇబ్బంది కార్యక్రమాన్ని నిర్వహించామని, విద్యార్థులు బందుకు సంపూర్ణంగా సహకరించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు.