నిజామాబాద్ సౌత్: తెలంగాణ సైదా పోరాటాలను పాఠ్యాంశంలో పొందుపరిచారు: CPI జిల్లా కార్యదర్శి సుధాకర్ డిమాండ్
తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు ఎంతోమంది త్యాగాలు చేశారని సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని పాఠ్యాంశంలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ సాయుధ పోరాట విలీన దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి. సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని తెలంగాణ ప్రభుత్వం పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరుతున్నామన్నారు. 77వ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సందర్భంగా ఈనెల 11 నుండి 16 వరకు గ్రామ, మండల కేంద్రాల్లో పార్టీ జెండాలు ఎగురవేసి, సభలు నిర్వహించడం జరిగిందన్నారు.